మనరోడ్లపై అత్యంత ఖరీదైన స్పోర్ట్స్కార్లు కన్పించడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. లాంబొర్గిని, ఆస్టన్ మార్టిన్ వంటి సంస్థలు భారత్‌లో డీలర్షిప్నూ ప్రారంభించాయి. ఈ సూపర్కార్లు రేస్‌లో పోటీపడిన వీడియోలు కూడా చాలానే చూశాం. వీటిని ట్యాక్సీలుగా ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఓ ఆడీ ఆర్8 ఓనర్ మాత్రం.. తన కారును స్విగ్గీ ఫుడ్ డెలివరీకి ఉపయోగిస్తున్నాడు. తానే స్వయంగా ఆర్డర్లు ఓకే చేసి వినియోగదారుల ఇళ్లకు.. ఈ ఖరీదైన కారులోనే వెళ్లి ఫుడ్ చేరవేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన వ్లాగ్‌లో పోస్ట్ చేశాడు.
తాను గతంలో హెచ్2 సూపర్‌బైక్‌పై ఫుడ్ డెలీవరీ చేసే వాడినని, అయితే ఆడి కారును ఇందుకు ఉపయోగించొచ్చు కదా అని అందరూ అడిగినందు వల్ల ఇలా చేస్తున్నట్లు ఓనర్ చెప్పాడు. తనతో పాటు స్విగ్గీ దుస్తులు ధరించిన మరో వ్యక్తి కారులో ఉంటాడు.