తన చెల్లిని ఏడిపించారని ఇద్దరు యువకులను చితకబాదాడు ఓ అన్న. దీంతో అతడిపై పగ పెంచుకున్న ఆ ఇద్దరు.. యువకుడిని హతమార్చారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే..దిల్లీలోని పటేల్ నగర్‌కు సమీపంలోని ఓ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం కంప్యూటర్ క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిని మార్గమధ్యలో మరో ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించగా అతను మరణించాడు. పరారీలో ఉన్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
గేదెపై అత్యాచారం..
మహారాష్ట్రలోని పుణెలో ఓ దారుణం జరిగింది. దక్కన్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి.. గేదెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతడ్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. నిందితుడు నేపాల్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ ఆ వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.