తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Skill Development Case Hearing in AP High Court: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. టీడీపీ అధినేత పలు పిటిషన్‌లపై నేడు విచారణ - బెయిలు కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్

Skill Development Case Hearing in AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అంతేకాకుండా చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై తదుపరి విచారణ హైకోర్టులో మంగళవారం ప్రారంభం కానుంది. జ్యుడీషియల్ రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని చంద్రబాబు కోరగా.. చట్టవిరుద్ధంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇవి మాత్రమే కాకుండా ఇతర కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేసులో నేడు విచారణ జరగనుంజి.

Skill_Development_Case_Hearing_in_AP_High_Court
Skill_Development_Case_Hearing_in_AP_High_Court

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2023, 7:19 AM IST

Skill Development Case Hearing in AP High Court: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు నేడు ఏపీ హైకోర్టులో విచారణ.. టీడీపీ అధినేత పలు పిటిషన్‌లపై నేడు విచారణ

Skill Development Case Hearing in AP High Court: తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో జరిగే విచారణలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పైనా నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. రాజధాని ప్రాంతంలో ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి.. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిలు కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్​పై నేడు విచారణ జరగనుంది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా విజయవాడ అనిశా కోర్టు ఈనెల 10న జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ.. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్​పై హైకోర్టు విచారణ జరపనుంది.

చంద్రబాబు హౌస్‌ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ..నిర్ణయం రేపటికి వాయిదా

అనినీతి నిరోధ చట్టం సెక్షన్ 17A నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థ పాటించలేదని.. చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రతిపక్ష నేతపై ఎఫ్​ఐర్​ నమోదు చేయాలన్నా, దర్యాప్తు కొనసాగించాలన్నా కచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలన్నారు. చట్టానికి విరుద్దంగా అరెస్ట్ చేశారని అంతటితో ఆగకుండా జ్యుడీషియల్ రిమాండ్​కు తరలించారని అన్నారు.

జ్యుడీషియల్ రిమాండ్​ను సస్పెండ్ చేయాలని హైకోర్టును కోరారు. ఈ కేసులో పిటిషనర్‌కు ఐపీసీ 409 సెక్షన్ వర్తించదన్నారు. ప్రభుత్వ న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరగా.. 18 వరకూ హైకోర్టు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేడు తదుపరి విచారణ జరగనుంది.

బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఏ ఆధారాలతో ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చారో చెప్పేందుకు సీఐడీ వద్ద ప్రాథమిక వివరాలు లేవని.. పిటిషనర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు. రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా ఈ కేసులోకి లాగారని.. ముఖ్యమంత్రి ప్రోద్భలంతో చంద్రబాబును ఈ కేసులో ఇరికించారన్నారు.

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ విచారణ.. ఈనెల 19కి వాయిదా

కేసు నమోదు చేసినప్పుడు పిటిషనర్ పేరు లేదని హఠాత్తుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారని కోర్టుకు తెలిపారు . బెయిల్ మంజూరు చేయాలని కోరారు. బెయిల్ పిటీషన్​పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీకి ఏసీబీ కోర్టు గత విచారణలో ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ కస్టడీ పిటీషన్ పైనా నేడు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.

రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ నిర్ణయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ.. సీఐడీ తనపై నమోదు చేసిన కేసులో బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పైనా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.

Chandrababu Bail Petition : అంగళ్లు ఘటన.. చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఈనెల 20కి వాయిదా

ABOUT THE AUTHOR

...view details