SJVN Engineering Jobs 2023 : ఉన్నత విద్య అభ్యసించి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మినీ రత్న హోదా కలిగిన ఎస్‌జేవీఎన్ లిమిటెడ్ 155 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది.
ఉద్యోగాల వివరాలు
- సివిల్ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్ - 90
- ఎలక్ట్రికల్ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్ - 15
- మెకానికల్ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్ - 10
- హెచ్ఆర్ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ - 10
- ఎఫ్ & ఏ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ - 12
- ఐటీ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్ - 8
- ఓఎల్ జూనియర్ ఫీల్డ్ ఇంజినీర్ - 2
- పీఆర్ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ - 4
- ఆర్కిటెక్చర్ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ - 4
విద్యార్హతలు
SJVN Job Qualification :
- ఇంజినీరింగ్ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఆయా పోస్టులకు అనుగుణంగా ఇంజినీరింగ్, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- హెచ్ఆర్ పోస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్/ సోషల్ వర్క్/ లేబర్ వెల్ఫేర్/ బిజినెస్ మేనేజ్మెంట్/ ఆఫీస్ మేనేజ్మెంట్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్వాలిఫై అయ్యుండాలి.
- ఎఫ్ & ఏ జూనియర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు సీఏ/ ఐసీడబ్ల్యూఏ-సీఎంఏ/ ఎం.కామ్ చేసి ఉండాలి.
- పీఆర్ పోస్టులకు జర్నలిజం/ పబ్లిక్ రిలేషన్స్/ మాస్ కమ్యునికేషన్ డిగ్రీ చేసి ఉండాలి.
- ఆర్కిటెక్టర్ పోస్టులకు ఫుల్‌టైమ్ ఆర్కిటెక్టర్ డిప్లొమా చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయోపరిమితి
SJVN Job Age Limit : అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు లోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి మినహాయింపులు వర్తిస్తాయి.