దిల్లీలో నిర్వహించిన ఆరో సీరో సర్వేలో (Delhi Serological Survey) 97 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. దిల్లీలోని అన్ని జిల్లాల్లో సీరోపాజిటివిటీ రేటు (Delhi Sero Survey) 95 శాతం దాటిందని అక్కడి వైద్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు. మహిళల్లో ఈ రేటు అధికంగా ఉందని చెప్పారు. 18 ఏళ్ల లోపు వారిలో 88 శాతం, 18 ఏళ్లు పైబడిన వారిలో 97 నుంచి 98 శాతం సీరోపాజిటివిటీ (Delhi Seropositivity) ఉందని వివరించారు.
టీకా పొందినవారిలో 97 శాతం, తీసుకోనివారిలో 90 శాతం యాంటీబాడీలు ఉన్నాయని జైన్ వెల్లడించారు. ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సీరో సర్వే ఇదేనని తెలిపారు. 28 వేల నమూనాలను పరీక్షించినట్లు చెప్పారు.
ఏప్రిల్, మే నెలలో రెండో వేవ్ విరుచుకుపడిన తర్వాత చేసిన తొలి సర్వే ఇదే కావడం గమనార్హం. జనవరిలో నిర్వహించిన సీరో సర్వేలో 56.13 శాతం మందికి యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది.