ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన మూడు రఫేల్ యుద్ధ విమానాల(rafale deal) బ్యాచ్ గురువారం భారత్కు చేరుకుంది. వీటితో బంగాల్ హషిమారాలోని రఫేల్ విమానాల రెండో స్క్వాడ్రన్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు వైమానిక దళ (IAF) వర్గాలు తెలిపాయి. ఆరో బ్యాచ్ రాకతో మూడింట రెండొంతుల రఫేల్ యుద్ధవిమానాలను(rafale deal) భారత్ అందుకుంది.
ట్విన్-ఇంజిన్ సామర్థ్యం కలిగిన రఫేల్.. వివిధ రకాల మిషన్లను సమర్థంగా నిర్వహించగలదు. భూ ఉపరితలం సహా.. సముద్రం, వాయు మార్గాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ.. నిరంతర నిఘాతో పాటు.. అణ్వాయుధాలను నిరోధించగలదు.