తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరేళ్ల బాలికపై చిరుత దాడి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి.. - బాలికను 200 మీటర్లు ఈడ్చుకెళ్లిన చిరుత దాడి

Leopard Attack In Karnataka : ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలికపై చిరుత దాడి చేసి 200 మీటర్లు ఈడ్చుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన బాలికను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

Leopard Attack In Karnataka
Leopard Attack In Karnataka

By

Published : Jun 27, 2023, 10:38 AM IST

Leopard Attack In Karnataka : ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. దాదాపు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. బాలిక కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు కర్రలతో వచ్చేసరికి.. భయపడి అక్కడి నుంచి పారిపోయింది చిరుత. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజనగర్​ జిల్లాలో సోమవారం జరిగింది.

ఇదీ జరిగింది..హనుర్ మండలంలోని కగ్గలిగుండి గ్రామంలో రాము అనే వ్యక్తి.. తన భార్య లలిత, కుమార్తె సుశీల(6)తో కలిసి నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో.. బాలిక ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా బాలిక వద్దకు వచ్చిన చిరుత.. ఆమెపై దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి దాదాపు 200 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచింది.

బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు.. క​ర్రలు తీసుకుని ఆమె వద్దకు పరుగెత్తారు. వారు రావడం చూసి భయపడ్డ చిరుత.. బాలికను అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే అంబులెన్సు, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం తీవ్ర గాయాలైన బాలికను ఓ ప్రైవేటు ఆస్పత్రికి అంబులెన్స్​లో తరలించారు. స్థానిక అటవీ శాఖ అధికారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు.

తండ్రిపై చిరుత దాడి.. కాపాడిన కుమార్తె..
ఇలాంటి ఘటన గత నెలలో ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. పొలంలో పని చేస్తున్న ఓ రైతుపై అకస్మాత్తుగా వచ్చిన ఓ చిరుత అతడిపై దాడి చేసింది. సమీపంలోనే ఉన్న అతడి కుమార్తె అప్రమత్తమై కర్రతో చిరుత వైపు రావడం వల్ల అక్కడి నుంచి పారిపోయింది. ఈ ఘటన పీలీభీత్​ జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది.. సంతోష్​పురా గ్రామానికి చెందిన డోరీలాల్​(40).. తన కుమార్తె గోమతితో కలిసి పొలానికి వెళ్లాడు. డోరీలాల్​ పొలంలో పనిచేస్తున్న సమయంలో పొదల్లో నుంచి బయటకు వచ్చిన ఓ చిరుతపులి అతడిపై దాడి చేసింది. సమీపంలోనే ఉన్న అతడి కుమార్తె గోమతి ధైర్యం ప్రదర్శించి కర్రతో చిరుతను తరిమికొట్టింది. ఆ తర్వాత చిరుత పారిపోయింది. ఘటన అనంతరం వెంటనే రైతును దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు తరలించారు. చిరుత సంచారంపై సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది.. దాన్ని పట్టుకునేందుకు సంతోష్‌పురా గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ వ్యక్తి చిరుతకు దగ్గరగా వెళ్లాడు. ఆందోళనకు గురైన చిరుతపులి అతడిపై దాడి చేసి పారిపోయింది.

ABOUT THE AUTHOR

...view details