ఓటింగ్‌పై అవగాహన- ఆటోను లాగిన ఆరేళ్ల చిన్నారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాట.. ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరుతూ ఓ ఆరేళ్ల బాలిక సాహసం చేసింది. స్కేటింగ్ రోలర్‌పై నిల్చుని, ఆటోను లాగి ఔరా అనిపించింది.
తమిళనాడులో ఆటోను లాగిన ఆరేళ్ల చిన్నారి తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా.. అందరూ ఓటింగ్‌లో పాల్గొనాలని ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా.. రవీనా అనే ఆరేళ్ల చిన్నారి.. తనవంతుగా ఈ కార్యక్రమంలో పాల్గొంది.
స్కేటింగ్ రోలర్ ధరించి, ఆటోను లాగుతున్న రవీనా 100 మీటర్లు లాగి..
స్కేటింగ్ రోలర్ కాళ్లకు ధరించిన రవీనా.. తాడుతో కట్టి ఉన్న ఆటోను 100 మీటర్లు లాగింది. తూత్తుకుడి కోవిల్‌పట్టిలోని శెన్బాగవల్లి అమ్మన్ మందిరం సమీపంలోని ప్రాంతం ఈ సాహస కృత్యానికి వేదిక అయింది. ఆటోను రవీనా లాగుతున్నప్పుడు చప్పట్లతో స్థానికులు ప్రోత్సహించారు. కోవిల్పట్టి డీఎస్పీ కాలాయ్ కాతిరావన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆటోను లాగుతుండగా.. వీడియోలు చిత్రీకరిస్తున్న స్థానికులు ఇదీ చూడండి:13 గంటల్లో 30 కిలోమీటర్లు ఈది మహిళ రికార్డు