తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాలువలోకి దూసుకెళ్లిన బొలెరో.. ఆరుగురు సజీవదహనం - ఉత్తరాఖండ్​ రోడ్డు ప్రమాదం

ఉత్తరాఖండ్​లో విషాద ఘటన జరిగింది. ఉత్తరకాశీ వెళ్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి హైవే పక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మరణించారు.

Road Accident:
Road Accident:

By

Published : May 25, 2022, 5:26 PM IST

Road Accident: ఉత్తరాఖండ్​లోని తెహ్రీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగోత్రి జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ బొలెరో వాహనం అదుపుతప్పి కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాద దృశ్యాలు

స్థానికుల సమాచారం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చంబా నుంచి ఉత్తరకాశీ వైపు బొలెరో వాహనం వెళ్తుంది. కోటిగడ్డ సమీపంలో వాహనం అదుపు తప్పి కాలువలో పడింది. వెంటనే వాహనం నుంచి మంటలు చెలరేగాయి. వాహనం కాలువలో పడిపోవడాన్ని గమనించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, వాహనంలో ప్రయాణికులు అప్పటికే పూర్తిగా కాలిపోయి చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details