ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జికా వైరస్ (Zika virus in India) కలకలం సృష్టిస్తోంది. చకేరీ ప్రాంతంలో కొత్తగా ఆరుగురికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. దీంతో నగరంలో జికా కేసుల సంఖ్య 10కి చేరింది.
ఆదివారం నిర్వహించిన నమూనా పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌గా (Zika virus in Kanpur) వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ గర్భిణీ సహా నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులకు జికా ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్ విశాక్ అయ్యర్, ఇతర వైద్యాధికారులు చకేరీకి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
జికా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. అనుమానిత కేసులను పసిగట్టే పనిలో పడ్డారు. చకేరీ ప్రాంతం నుంచి 645 నమూనాలను వైద్య బృందాలు సేకరించాయి. వీటిని పరీక్షల కోసం లఖ్‌నవూలోని కేజీఎంయూ, పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్కి పంపించారు.
ప్రత్యేక వార్డు
జికా బాధితుల కోసం కాన్షీరాం ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు యూపీ అంటువ్యాధుల శాఖ డైరెక్టర్ జీఎస్ బాజ్‌పాయ్ తెలిపారు. బాధితులను దోమ తెరల లోపల ఉంచుతున్నట్లు చెప్పారు. కొత్తగా పాజిటివ్‌గా తేలిన ఆరుగురిని హోమ్ క్వారంటైన్లో ఉంచినట్లు వెల్లడించారు. ఎవరికీ లక్షణాలు (Zika virus symptoms) లేవని చెప్పారు. బాధితులకు చికిత్స (Zika virus Treatment) ప్రారంభించామని తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు బాధితుల కుటుంబ సభ్యులను బయటకు రావొద్దని స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా గుర్తించారు.
శనివారం ముగ్గురికి జికా పాజిటివ్‌గా తేలింది. ఇందులో ఇద్దరు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. అంతకుముందు, అక్టోబర్ 23న తొలి కేసు నమోదైంది. దీంతో, కేంద్రం నిపుణుల బృందాన్ని రాష్ట్రానికి పంపింది.
ఇదీ చదవండి:జికా వైరస్.. కరోనా కంటే ప్రమాదకరమా?