మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్.. ఇది మాములు పాన్ షాప్ కాదండోయ్. ఈ షాపులో దాదాపు 600 రకాల పాన్లు దొరుకుతాయి. ఈ షాప్‌లో ఇరవై ఐదు రూపాయల పాన్ నుంచి.. లక్షన్నర రూపాయల ధరల వరకు పాన్లు అందుబాటులో ఉంటాయి. మహారాష్ట్రలోని నాశిక్‌లో ఉంది ఈ మౌలి ఫ్యామిలీ పాన్‌హౌస్. గత ఎనిమిది ఏళ్లుగా ఈ పాన్ షాపును నిర్వహిస్తున్నాని చెబుతున్నాడు గణేశ్ దుక్రే అనే యువకుడు.
గణేశ్ దుక్రే బీఏ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం కొద్ది రోజులు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. ఎటువంటి ఉద్యోగం దొరకని కారణంగా తానే సొంతంగా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే.. ఓ పాన్ షాపు ప్రారంభించాలని తలిచాడు. అందుకోసం పుణె వెళ్లి ఓ పాన్ షాప్‌లో కొన్ని రోజులు పనిచేశాడు. అక్కడ వివిధ ఆకులు, పాన్ల గురించి తెలుసుకున్నాడు. అనంతరం నాసిక్ వచ్చి వ్యాపారం ప్రారంభించాడు. ఈ పాన్హౌస్కు చాలా మంది అభిమానులే ఉన్నారు. నాశిక్ వచ్చిన పర్యటకులు.. కచ్చితంగా ఈ పాన్ షాపునకు వస్తుంటారు.