ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం (Employees dismissed in Kashmir) వేటు వేసింది. ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయన్న ఆరోపణలతో వీరిని విధుల నుంచి తొలగించింది. వీరిని డిస్మిస్ చేయాలని ప్రభుత్వం ఏర్పాటు కమిటీ సిఫార్సు చేసిందని అధికార వర్గాలు తెలిపాయి.
వేటు వీరిపైనే
- అబ్దుల్ హమిద్ వాని- టీచర్- అనంతనాగ్ జిల్లా బిజ్బెహారా ప్రాంతం
- జాఫర్ హుస్సేన్ భట్- కానిస్టేబుల్- కిష్టావర్
- మహ్మద్ రఫీ భట్- రోడ్లు, భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్- కిష్టావర్
- లియాకత్ అలీ కక్రూ- టీచర్- బారాముల్లా
- తారిక్ మెహ్మూద్ కోహ్ల్- అటవీశాఖ రేంజ్ అధికారి- పూంచ్
- షౌకత్ అహ్మద్ ఖాన్- కానిస్టేబుల్- బుద్గామ్
ఈ టీచర్.. ఉగ్ర కమాండర్!
టీచర్ ఉద్యోగంలో చేరకముందు అబ్దుల్ హమిద్ వాని (Abdul Hamid Wani).. అల్లా టైగర్స్ ఉగ్రవాద సంస్థకు జిల్లా కమాండర్‌గా పనిచేసే వాడని అధికారులు తెలిపారు. పలుకుబడి ఉపయోగించి ఎలాంటి సెలక్షన్ ప్రక్రియ లేకుండానే ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరినట్లు గుర్తించారు. బుర్హాన్ వాని ఎన్కౌంటర్ తర్వాత జరిగిన నిరసన కార్యక్రమాల్లో కీలక ప్రసంగాలు చేశాడని, వేర్పాటువాద భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నాడని తెలిపారు. (Employees dismissed in Kashmir)
ముష్కరుల కోసం పనిచేసే కానిస్టేబుల్
జమ్ము కశ్మీర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న జాఫర్ హుస్సేన్ భట్ (Jaffer Hussain Butt).. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని 2019లో ఎన్ఐఏ అతడిని అరెస్టు చేసింది. అదే ఏడాది సెప్టెంబర్ 30న బెయిల్‌పై బయటకు వచ్చాడు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు తన కారును అందించాడన్నది ప్రధాన ఆరోపణ. ఇది తాజాగా రుజువైంది. (Employees dismissed in Kashmir)
ముష్కరులకు సకల సౌకర్యాలు
జూనియర్ అసిస్టెంట్ మహ్మద్ రఫీ భట్.. కిష్టావర్‌లోని హిజ్బుల్ తీవ్రవాదులకు లాజిస్టిక్ సౌకర్యాలు కల్పిస్తున్నాడు. ఉగ్రవాదులు తమ ప్రణాళికలను అమలు చేసేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. ఇతడిని ఎన్ఐఏ గతంలోనే అరెస్టు చేయగా.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. (Employees dismissed in Kashmir)