మేఘాలయ తూర్పు జైంతియా హిల్స్ జిల్లా ఖ్లెహరియత్లోని ఓ గనిలో వరదల కారణంగా ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అసోంకు చెందిన ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అసోం కాఛార్ జిల్లా పోలీసులకు తెలియజేసినట్లు మేఘాలయ పోలీసులు వెల్లడించారు. వరదల్లో గల్లంతైన వీరి ఆచూకీ కోసం సహాయక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.
బొగ్గు గనిలో ప్రమాదం- ఆరుగురు కార్మికులు మృతి! - mine accident news latest
మేఘాలయలోని ఓ బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అసోంకు చెందిన ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
బొగ్గు గనిలో ప్రమాదం
గనిలో డైనమైట్ అకస్మాత్తుగా పేలడం వల్ల ఒక్కసారిగా నీటి ప్రవాహం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. కొందరు కార్మికులు లోపలే చిక్కుకున్నట్లు చెప్పారు.
ఈ విషయం గురించి ఎవరికీ చెప్పొద్దని కార్మికులను బెదిరించిన సూపర్వైజర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.