Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ఎస్యూవీ కారు డ్రైవర్ ఎదురుగా వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు.
పోలీసులు వివరాల ప్రకారం.. పండర్పుర్-మొహోల్ జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ ఒక వైపు మాత్రమే వాహనాలు తిరుగుతున్నాయి. అయితే ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆ రోడ్డులో.. ముందు వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న కారును ఎస్యూవీ ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గరు అక్కడిక్కడే మరణించగా, మరో ముగ్గురు ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. ఎస్యూవీలో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.