బిహార్‌లో ఘోరం- ఆరుగురు చిన్నారులు సజీవదహనం - బీహార్ అరారియా జిల్లా అగ్ని ప్రమాదం

14:50 March 30
ఆరుగురు చిన్నారులు సజీవదహనం
బిహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. అరారియా జిల్లా కబైయా గ్రామంలో ఓ పూరింట్లో చెలరేగిన మంటల్లో చిక్కుకొని ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్క జొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకొని ఈ విషాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు. చిన్నారుల హాహాకారాలు విని స్థానికులు అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3 నుంచి ఆరేళ్లు లోపు చిన్నారులే కావడం అందరినీ కలచివేస్తోంది. ఆరుగురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోయే సరికి గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో చిన్నారులు ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నట్లు తెలిసింది.
ఇదీ చదవండి :నందిగ్రామ్ నాది.. ఇక్కడే ఉంటా: దీదీ