women killed her six children: ఓ మహిళ తన ఆరుగురు పిల్లలను బావిలోకి తోసేసి చంపింది. అనంతరం తానూ అందులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ దారుణం మహారాష్ట్రలోని మహాడ్లో జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు మరణించగా.. ఆత్మహత్యకు యత్నించిన తల్లి బతికింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు.
ఆరుగురు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి - మహడ్ న్యూస్
women killed her six children: మహారాష్ట్ర మహాడ్లో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఆరుగురు పిల్లలను బావిలో పడేసి చంపింది. ఆపై తాను దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.
మహాడ్లోని ధలకతి గ్రామంలో నివసించే ఓ దంపతులకు ఆరుగురు పిల్లలు ఉన్నారు. భర్త మద్యానికి బానిసై రోజూ తాగి వచ్చి వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహానికి గురైన మహిళ.. తన ఆరుగురు పిల్లలను బావిలోకి పడేసి అనంతరం ఆమె దూకింది. ఇది గమనించిన స్థానికుడు బావిలోకి దూకి ఆమెను రక్షించాడు. చనిపోయిన ఆరుగురు పిల్లల్లో ఒక అబ్బాయి, ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు. గ్రామస్థుల సాయంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు.. నలుగురు చిన్నారుల మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఎమ్మెల్యే సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఇదీ చదవండి:దిల్లీలో గాలివాన బీభత్సం.. పలు ప్రాంతాల్లో పిడుగులు