తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC Paper Leak Case : టీఎస్పీఎస్సీ పేపర్​ లీకేజీ @19 మంది అరెస్టు - SIT

19 Arrests In TSPSC Paper Leak Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజి కేసులో.. సిట్ దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. తాజాగా సిట్‌ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేయడంతో.. ఈ కేసులో అరెస్టుల సంఖ్య 19కి చేరింది. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మైబయ్య అనే వ్యక్తి తన కుమారుడి కోసం.. పేపర్‌ను డాక్యా నాయక్ నుంచి కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం రావాలని.. అప్పు చేసి మరీ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది.

TSPSC
TSPSC

By

Published : Apr 22, 2023, 7:09 AM IST

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ కేసులో వేగం పెంచిన సిట్​ అధికారులు

19 Arrests In TSPSC Paper Leak Case: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ కేసులో తాజాగా మరో ఇద్దరు అరెస్టయ్యారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకూ నిందితుల సంఖ్య 20కు చేరింది. వీరిలో న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌ మినహా.. మిగిలిన 19 మందిని సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌ మండలం జాగురెడ్డి పల్లికి చెందిన మైబయ్య.. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.

ఇతడికి ముగ్గురు కుమారులు. చిన్నకుమారుడు జనార్దన్‌ డిప్లొమో పూర్తి చేసి.. అనంతరం బీటెక్‌ చదివాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సమయంలో గతేడాది టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టు కోసం.. జనార్దన్‌ దరఖాస్తు చేశాడు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణకు చేరాడు. గండీడ్‌ మండలంలో ఉపాధిహామీ పథకంలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఢాక్యానాయక్‌తో.. మైబయ్యకు పాత పరిచయం ఉంది. తమ మధ్య ఉన్న పరిచయంతో కుమారుడు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పరీక్షకు సిద్ధమవుతున్నట్టు చెప్పాడు.

TSPSC Paper Leak Case Update: టీఎస్‌పీఎస్సీలో తనకు తెలిసిన వారి వద్ద.. ఏఈ ప్రశ్నాపత్రం ఉందని రూ. 6 లక్షలు ఇస్తే దాన్ని ఇస్తానంటూ ఢాక్యానాయక్‌ చెప్పాడు. తాను అంత పెద్దమొత్తంలో నగదు ఇవ్వలేనంటూ చెప్పాడు. చివరకు రూ. 2లక్షలకు బేరం కుదిరింది. తన వద్ద ఉన్న లక్ష రూపాయలతో పాటు మరో లక్ష అప్పు తీసుకుని మొత్తంగా రూ. 2లక్షలు తనకు మైబయ్య ఇచ్చాడు.

డబ్బు అందినే తర్వాత ఏఈ పరీక్షకు ఒక రోజు ముందు అంటే మార్చి 4న జనార్దన్‌ను ఢాక్యానాయక్‌ తన ఇంటికి పిలిపించాడు. తన వద్ద ఉన్న మాస్టర్‌ ప్రశ్నాపత్రం చేతికిచ్చి అక్కడే ఉండి పూర్తిగా బట్టీ పట్టించాడు. మరుసటి రోజు జనార్ధన్ పరీక్షను రాశాడు. కాగా గత నెల 11 టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ బహిర్గతం కావటంతో.. బేగంబజార్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 13న 9 మంది నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. వీరిలో కీలక నిందితులు భార్యాభర్తలు రేణుక రాథోడ్, ఢాక్యానాయక్‌లు ఏఈ ప్రశ్నాపత్రం కొనుగోలు చేసినట్టు నిర్దారించారు.

ఎవరికీ తెలియకుండా పేపర్​ను విక్రయించిన డాక్యానాయక్​: భార్య రేణుకకు తెలియకుండా ఢాక్యానాయక్‌ గండీడ్‌ మండలంలో తిరుపతయ్య అనే దళారి ద్వారా.. ప్రశాంత్‌రెడ్డి, రాజేందర్‌కుమార్‌లకు ఏఈ ప్రశ్నాపత్రం విక్రయించినట్టు గుర్తించారు. ఢాక్యానాయక్‌ ఫోన్‌కాల్‌ జాబితా, బ్యాంకు ఖాతాలను పరిశీలించినపుడు మైబయ్య, జనార్దన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. రెండు రోజుల క్రితమే వారిని సిట్​ పోలీసులు అదుపులోకి తీసుకొని.. ఆధారాలు సేకరిస్తున్నారు. శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. లీకేజ్‌ వ్యవహారంలో ఇప్పటి వరకూ 19 మంది అరెస్ట్ కాగా వీరిలో 11 మంది గండీడ్‌ మండలానికి చెందిన వారే ఉన్నారు.

TSPSC Paper Leak Case: ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ నుంచి ఏఈ ప్రశ్నపత్రాన్ని రూ. 10లక్షలకు రేణుక, ఢాక్యానాయక్‌ దంపతులు కొనుగోలు చేశారు. రూ. 13.50లక్షలకు నీలేష్, గోపాల్‌నాయక్‌లకు విక్రయించి దానిలో ప్రవీణ్‌కు రూ. 10లక్షలు చెల్లించారు. భార్యకు తెలియకుండా ఢాక్యానాయక్‌ తెర వెనుక పెద్ద వ్యవహారమే నడిపించాడు. ఉపాధి హామీ పథకం ద్వారా ఏఈ ప్రశ్నాపత్రం విక్రయానికి దళారులను ఏర్పాటు చేసుకున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details