Sisters With Hearing Impairment: భారత్లో అత్యంత కఠిన పరీక్షల్లో ఒకటి.. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్). ఎంతో కష్టపడితే కానీ ఉత్తీర్ణులవటం కష్టం. అలాంటిది ఇద్దరు బధిర సోదరీమణులు.. అందులో ర్యాంకు సంపాదించి నిజంగానే 'మణులు' అనిపించుకున్నారు. వారే కేరళకు చెందిన పార్వతీ ఎస్, లక్ష్మి ఎస్. ఆ రాష్ట్రం నుంచి ఐసీఎస్ ఉత్తీర్ణత సాధించింది కూడా వీరిద్దరే. అఖిల భారత స్థాయిలో పార్వతి 74వ ర్యాంకు, లక్ష్మి 75వ ర్యాంకుతో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.
కలను సాకారం చేసుకోవడంలో తమ లోపాన్ని అడ్డురానివ్వలేదు ఈ అక్కాచెల్లెల్లు. అయితే.. అదేమంత సులువు కాదు. వినికిడి లోపం కారణంగా అందరిలా వీరు కోచింగ్ సెంటర్లకు వెళ్లలేరు. అయినా పట్టువిడవలేదు. నిరంతర కఠిన పరిశ్రమ, నిబద్ధతతో చదివారు. చెవులు దద్దరిల్లే విజయఢంకా మోగించారు.
తల్లే.. అన్నీ తానై:వీరి తల్లి సీత.. ప్రజాపనుల విభాగంలో జూనియర్ సూపర్ఇంటెండెంట్గా పనిచేస్తున్నారు. తండ్రి చిన్నప్పుడే చనిపోయారు. అయితే ఆ ప్రభావం చిన్నారులపై పడనివ్వలేదు సీత. వారికి ఉన్నత విద్యను అందించేందుకు శాయశక్తుల కష్టపడ్డారు. ఆమె గర్వపడే విజయాన్ని అందించారు.. పార్వతి, లక్ష్మి!