Sisters Suicide After Rape In Assam : అసోం.. కామ్రూప్ జిల్లాలో దారుణం జరిగింది. అత్యాచారానికి గురైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను గుర్తించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తులసిబారి ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు బంధువులు. వరుసకు అక్కాచెల్లెళ్లు అవుతారు. వీరిద్దిరిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమ్మాయిలు.. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. చెట్టుకు వేలాడుతున్న వీరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అమ్మాయిల మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ హితేశ్ చంద్ర రాయ్ స్పందిచారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.