Sister dies with heart attack: తోడపుట్టిన అన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది ఆ యువతి. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా తోడుగా ఉండే అన్న.. ఆసుపత్రిలో విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. తల్లిదండ్రులతో పాటు అన్న మృతదేహాన్ని చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆమె.. అక్కడే గుండెపోటుతో మృతిచెందింది.
ఇదీ జరిగింది..
కర్ణాటకలోని కొడగు జిల్లా పొన్నాపేట్కు చెందిన మంజునాథ్, రత్న దంపతులకు కీర్తిరాజ్, రష్మీ సంతానం. మైసూరులోని ప్రభుత్వ కళాశాలలో బీకామ్ రెండో సంవత్సరం చదువుతోంది రష్మీ. సోమవారం రాత్రి.. మైసూరు-మంగళూరు హైవే వద్ద హునసూర్ తాలుక పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కీర్తిరాజ్ దుర్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకుని తల్లిదండ్రులు హుటాహుటిన హునసూర్ ఆసుపత్రికి చేరుకున్నారు.