దిల్లీలో కరోనా చికిత్స పొందుతున్న రోగులకు ప్రతిరోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. మే 5న తొలిసారిగా 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపిన సందర్భంగా.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే గత రెండు రోజులుగా సరఫరా తగ్గిందని.. గతంలో ఇచ్చిన మోతాదును కొనసాగించాలని కోరారు.
"మే 5వ తేదీన 730 మెట్రిక్ టన్నుల(ఎంటీ) ఆక్సిజన్ పంపినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు. దానిని కొనసాగించాలని కోరుతున్నాం. మే 6న 577ఎంటీ, మే 7న 487 మెట్రిక్ టన్నులకు సరఫరా పడిపోయింది. 700 ఎంటీ కన్నా తక్కువ సరఫరా ఉంటే మాత్రం ఆసుపత్రులను నిర్వహించడం మాకు చాలా కష్టం"
-మనీశ్ సిసోడియా