కరోనా టీకా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు మధ్యప్రదేశ్ సింగ్రౌలీ జిల్లా కలెక్టర్ రాజీవ్ రంజన్ మీనా. డిసెంబర్ 15 నాటికి టీకా రెండు డోసులు తీసుకోవాలని ప్రజలను కరాఖండీగా చెప్పారు. ఆ మరుసటి రోజు నుంచి వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా బహిరంగ సమావేశాలు, ఫంక్షన్లు, హోటళ్లు, ప్రైవేట్ సంస్థలకు వెళ్లే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేశారు.
డిసెంబర్ 15 తర్వాత కరోనా టీకా తీసుకోని వారిని ప్రెవేటు సంస్థలు, హెటళ్లు అనుమతించవద్దని కలెక్టర్ ఆదేశాల్లో ఉంది. టీకా తీసుకోకుండా అందరూ గుమికూడితే వైరస్‌కు కేంద్రబిందువుగా మారే ప్రమాదముందని అందులో హెచ్చరించారు. అందుకే ప్రజలంతా రెండు డోసులు టీకా తీసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. టీకా తీసుకోని వారిపై సెక్షన్ 144(1), మధ్యప్రదేశ్ ప్రజారోగ్య చట్టం 1949లోని సెక్షన్ 71(1), 71(2) కింద కేసు నమోదు చెయనున్నన్నట్లు పేర్కొన్నారు. అయితే వైద్య కారణాల కారణంగా టీకా తీసుకోలేని వారికి మాత్రం మినహాయింపునిచ్చారు.
రేషన్ కార్డు ఉన్నవాళ్ల కుటుంబసభ్యులు కచ్చితంగా రెండు డోసుల టీకాల తీసుకోవాలని మధ్యప్రదేశ్ ఆహార, పౌర సరఫరా శాఖ ఇప్పటికే తేల్చిచెప్పింది.18 ఏళ్లు పైబడి టీకా తీసుకోని వారి వివరాలను ఆరోగ్య శాఖకు అందజేయాలని అధికారులను ఆదేశించింది.
అందుకే కఠిన ఆదేశాలు..