సాధారణంగా పోలింగ్ బూత్ దగ్గర ఉదయం నుంచే బారులు తీరే జనాలను చూసుంటాం. ఆ క్యూను చూసి విసుగు చెంది వెనుతిరిగే ఓటర్లనూ చూసుంటాం. కానీ గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్‌లో మాత్రం ఇందుకు భిన్నంగా ఓ పోలింగ్ కేంద్రం దర్శనమిస్తుంది. అక్కడ ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య చెప్తే మీరు షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే అక్కడ ఓటు వేసేందుకు వచ్చేది ఒక వ్యక్తి మాత్రమే. ఆ ఒక్కరి కోసమే ప్రత్యేకంగా పోలింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తారు.
గుజరాత్‌లోని ఉనా నియోజకవర్గం బనేజ్ ప్రాంతానికి చెందిన మహంత్ హరిదాస్ బాపు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఎన్నికల్లోనూ ఆ పోలింగ్ స్టేషన్‌కు వస్తారు. ఆ ప్రాంతంలో నివసించేది ఆయన ఒక్కరే అయినందున ఆయన కోసమని ఈసీ అక్కడ ఓ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఎనిమిది మంది అధికారులు, భద్రతా సిబ్బందిని పంపుతుంది.
ఉనా అసెంబ్లీలోని బనేజ్ పోలింగ్ కేంద్రానికి 2002 నుంచి శివుని మందిరం వద్ద నివాసమున్న మహంత్ భరత్‌దాస్ బాపు అనే వ్యక్తి ఒక్కరే ఓటు వేసేందుకు వచ్చేవారు. అప్పట్లో ఆయన కోసమే ఈ పోలింగ్ బూత్ ఏర్పాటు చేసేది ఈసీ. 2019లో ఆయన మరణించిన తర్వాత ఆ పోలింగ్ బూత్‌ను మూసివేయాలనుకున్నారు అధికారులు. అయితే ఆయన వారసుడిగా మహంత్ హరిదాస్ మహరాజ్ రావడం వల్ల తిరిగి ఆ పోలింగ్ బూత్‌ను ప్రారంభించారు. తన కోసం పోలింగ్ స్టేషన్‌ను పునఃప్రారంభించినందుకు హరిదాస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుజరాత్‌లోని మొత్తం 182 నియోజకవర్గాలకు రెండు దశల్లో(డిసెంబర్ 1న, 5న) పోలింగ్ జరగనుంది. హిమాచల్ ప్రదేశ్‌తో కలిపి డిసెంబర్ 8న గుజరాత్ శాసనసభ ఎన్నికల ఫలితం వెలువడనుంది.
ఇదీ చదవండి:గుజరాత్ త్రిముఖ సమరం.. విజేతలను తేల్చే అంశాలివే.. ఓటరు తీర్పు ఎటువైపో?
కలెక్టరమ్మ వచ్చింది.. రాములోరి గుడికి కాంతులు తెచ్చింది