తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఒకే దశలో బంగాల్​కు ఎన్నికలు భాజపాతోనే సాధ్యం'

తాము అధికారంలోకి వస్తే ఒకే దశలో ఎన్నికలు జరిగేలా.. బంగాల్​ను తీర్చిదిద్దుతామని బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్​ పై తృణమూల్​ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బంగాల్​లో అధికార పార్టీ సృష్టించిన రాజకీయ హింస కారణంగానే.. ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

Single-phase poll in Bengal if BJP voted to power: Dilip Ghosh
'బంగాల్​లో ఒకే దశలో ఎన్నికలు.. భాజపాతోనే సాధ్యం'

By

Published : Feb 27, 2021, 6:52 PM IST

బంగాల్​లో అధికార తృణమూల్​ కాంగ్రెస్ సృష్టించిన రాజకీయ హింస కారణంగానే.. రాష్ట్రంలో ఎనిమిది దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని బంగాల్​ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్​ ఆరోపించారు. భాజపా అధికారంలోకి వస్తే.. ఓకే దశలో ఎన్నికలు జరిగే విధంగా బంగాల్​ను మారుస్తామని హామీ ఇచ్చారు.

"ఎన్నికలు స్వేచ్ఛగా, నిజాయతీగా జరగాలన్న ఉద్దేశంతోనే బంగాల్​లో 8 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అధికార టీఎంసీ కారణంగా రాష్ట్రంలో రాజకీయ హింస పెరిగిపోయింది. భాజపా అధికారంలోకి వస్తే బంగాల్​ను హింస నుంచి విముక్తి చేస్తాం. రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరిగితే అది బంగాల్​కు గర్వ కారణం."

-- దిలీప్ ఘోష్​, బంగాల్​ భాజపా అధ్యక్షుడు

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలను ఎనిమిది దశల్లో నిర్వహించడాన్ని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్​ షా సూచనలు మేరకు ఎన్నికల తేదీలను ప్రకటించారా? అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి :బంగాల్​లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మెగా ర్యాలీ!

ABOUT THE AUTHOR

...view details