కరోనా వ్యాక్సిన్ కొరత ఎదుర్కొంటున్న భారత్‌లో.. త్వరలోనే సింగిల్ డోసు టీకా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ భారత్‌లో సింగిల్ డోసు వ్యాక్సిన్ ఉత్పత్తి, పంపిణీ చేసేందుకు భాగస్వామ్య కంపెనీ కోసం ప్రయత్నాలు చేస్తోంది.
'గేమ్ ఛేంజర్'
ఇదే సమయంలో స్పుత్నిక్ లైట్ పేరుతో వెలువడిన రష్యా వ్యాక్సిన్ తుది దశ ప్రయోగ ఫలితాలు ఈ నెల చివరినాటికి వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో జులై నాటికి స్పుత్నిక్ లైట్ టీకానే భారత్‌లో తొలుత అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు భారత్‌లో స్పుత్నిక్ వీ పంపిణీ చేపట్టిన డాక్టర్ రెడ్డీస్ సంస్థ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వ్యాక్సిన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌లో సింగిల్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కరోనా పోరులో 'గేమ్ ఛేంజర్'గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఆ తర్వాతే అందుబాటులోకి
'స్పుత్నిక్ లైట్' క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) పరిశీలించి వినియోగానికి అనుమతించిన తర్వాతే దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని డాక్టర్ రెడ్డీస్ సంస్థ సీఈఓ ఎం.వి. రమణ తెలిపారు. రష్యా వ్యాక్సిన్‌కు భారత్‌లో డాక్టర్ రెడ్డీస్ భాగస్వామిగా ఉండడం వల్ల ఫలితాలు వెలుబడిన వెంటనే భారత్‌లో 'స్పుత్నిక్ లైట్' అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఒక డోసు రూ.995