తెలంగాణ

telangana

ETV Bharat / bharat

West Bengal: మమత 'నందిగ్రామ్​' పిటిషన్​పై తీర్పు వాయిదా

బంగాల్​లోని నందిగ్రామ్​ ఎన్నికల ఫలితాన్ని సవాల్​ చేస్తూ​ సీఎం మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్​పై తీర్పును రిజర్వ్​ చేసింది కోల్​కతా హైకోర్టు. మరో బెంచ్​కు తమ పిటిషన్​ను అప్పగించాలని కోరేందుకు పిటిషనర్​కు పూర్తి హక్కు ఉంటుందని వ్యాఖ్యానించింది.

Mamata Banerjee
మమతా పిటిషన్​పై తీర్పు వాయిదా

By

Published : Jun 24, 2021, 1:34 PM IST

నందిగ్రామ్​లో భాజపా నేత సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ.. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన వ్యాజ్యంపై తీర్పును వాయిదా వేసింది కోల్​కతా హైకోర్టు.

నందిగ్రామ్​ ఫలితాలను సవాల్​ చేస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్​ సహా న్యాయమూర్తి తప్పుకోవాలని కోరుతూ చేసిన దరఖాస్తులపై విచారణ చేపట్టింది జస్టిస్​ కౌషిక్​ చందా నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.

మమత తరఫున హాజరైన న్యాయవాది సింగ్వీ వాదనలు వినిపించారు. జస్టిస్​ చందాకు భాజపాతో సంబంధాలు ఉన్నాయని పలు ఆధారాలు చూపించారు. గతంలో ఓ కేసులో న్యాయమూర్తి కలుగజేసుకున్న సందర్భాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా.. విచారణ నుంచి న్యాయమూర్తిని తప్పుకోవాలని, మరో బెంచ్​కు అప్పగించాలని కోరేందుకు పిటిషనర్​కు పూర్తి హక్కు ఉంటుందని, అందుకు భరోసా ఇస్తున్నామని జస్టిస్​ చందా పేర్కొన్నారు. ఈ విషయం న్యాయపరంగానే నిర్ణయమవుతుందన్నారు.

విచారణకు ముందు తమ కేసును మరో బెంచుకు అప్పగించాలని కోరుతూ.. మమత తరఫు న్యాయవాది హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

ఇదీ చూడండి:Sonia: 'ప్రజలు టీకా తీసుకునేలా ప్రోత్సహించాలి'

ABOUT THE AUTHOR

...view details