తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓటర్లలో ఉదాసీనతకు జమిలి ఎన్నికలతో చెక్!'

ఏక కాలంలో అన్ని ఎన్నికలు నిర్వహించడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం తన నివేదికను ఉభయ సభలకూ సమర్పించింది. ఏకకాలంలో ఎన్నికలను నిర్వహించడం ద్వారా.. ప్రభుత్వ ఖజానాపై భారంతోపాటు ఓటర్లలో ఉదాసీనత తగ్గుతుందని అభిప్రాయపడింది.

Simultaneous elections will reduce voters apathy of frequent polls: Parliamentary panel
'జమిలి ఎన్నికలు ఓటర్లలో ఉదాసీనతను తగ్గిస్తాయి'

By

Published : Mar 17, 2021, 10:29 AM IST

దేశవ్యాప్తంగా ఒకేసారి(జమిలి) ఎన్నికలు నిర్వహించడంపై పార్లమెంటరీ స్థాయి సంఘం చర్చించింది. ఏకకాల ఎన్నికల ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారాన్ని, రాజకీయ పార్టీల ఖర్చును తగ్గించి... వనరులను సక్రమంగా వినియోగించుకోవచ్చని అభిప్రాయపడింది. ఓటర్లలో ఉదాసీనత తగ్గి సాధారణ ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొంది. అంతేకాకుండా.. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల భాగస్వామ్యం మరింత మెరుగయ్యేందుకు అవకాశమున్నట్టు తెలిపింది. ఈ మేరకు పార్లమెంటరీ స్థాయీ సంఘం కొన్ని సూచనలిస్తూ.. తమ నివేదికను ఉభయసభల్లో మంగళవారం సమర్పించింది.

ఇదీ చదవండి:దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా?

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడం కొత్తేమీ కాదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది. తొలి మూడు సార్లు(1952, 1957, 1962) జరిగిన సార్వత్రిక ఎన్నికలు కూడా ఏకకాలంలోనే జరిగాయని గుర్తుచేసింది. రాజ్యాంగంలోని పలు నిబంధనలను సవరిస్తూ.. వీటిని అమల్లోకి తీసుకురావాలని పేర్కొంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details