Best Tips for wear Normal Saree As Looking Style : చీర అందరూ కడతారు. కానీ.. దానికి సరైన లుక్ తేవడం ఎలా అన్నది మాత్రం అందరికీ తెలియదు. అందుకే.. మీకోసం కొన్ని టిప్స్ తెచ్చాం. ఈ టిప్స్(Fashion Tips) తెలిస్తే.. సాధారణ చీరకు సైతం డిజైనర్ లుక్ తేవొచ్చు. మీకు మీరే ఫ్యాషన్ డిజైనర్లుగా మారిపోవచ్చు. మరి.. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
కలర్ :ఒకచీర మీకు అందాన్ని తేవాలంటే.. కావాల్సింది ఆ చీర కాస్ట్లీగా ఉండడం కాదు! మీ మేని ఛాయకు తగ్గట్టుగా ఉండడం. అది నార్మల్ శారీ అయినా సరే.. మీకు సరిపడే రంగును ఎంచుకోవాలి. చీర కట్టుకోవడంలో ఇది మొదటిది, ముఖ్యమైనది.
ప్రింట్స్ :మీరు సెలక్ట్ చేసుకునే చీర ప్రింట్స్ చక్కగా ఉండాలి. మీరు లైట్ కలర్ చీర ఎంచుకుంటే.. ప్రింట్స్ మరింత చక్కగా కనిపించాలి. లేకపోతే.. మంచి డార్క్ కలర్స్‌తో ఉండే చీరను తీసుకున్నా సరిపోతుంది.
మ్యాచింగ్ బ్లౌజ్ : అలాగే శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకోవాలి. అప్పుడే మీ చీరకు మంచి లుక్ వస్తుంది. ఫుల్ స్లీవ్స్ అయినా.. స్లీవ్‌లెస్ అయినా.. ఈ రెండిట్లో మీకు నచ్చిన జాకెట్ మోడల్ ఎంచుకోవచ్చు.
కాంట్రాస్ట్ బ్లౌజ్:నార్మల్ చీరను హైలెట్ చేయడంలో.. కాంట్రాస్ట్ బ్లౌజ్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. గతంలో కంటే.. ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్‌ల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. పూర్తి ప్లెయిన్, వర్క్‌తో కూడిన కాంట్రాస్ట్ బ్లౌజ్‌తో శారీకి మ్యాచ్ చేస్తే.. మీ లుక్ మొత్తం మారిపోతుంది.
ట్రెండీగా కనిపించాలని అనుకుంటున్నారా.. ఈ చిట్కాలు ఫాలో అవ్వండి!
స్టైల్ మార్చండి :చీరను ఎప్పుడూ ఒకేలా చుట్టడం కాదు.. అప్పుడప్పుడూ డిఫరెంట్‌గా కట్టడం కూడా ట్రై చేయాలి. చీర కట్టడంలో ఎన్నో రకాలు ఉన్నాయి. యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా.. ఇంటర్నెట్లో వెదికినా.. చీర కట్టడంలో చాలా రకాలు మీకు కనిపిస్తాయి. వాటిని ట్రై చేయొచ్చు.
జ్యువెలరీ : ఇక చివరగా మీరు ఎంచుకునే జ్యువెలరీ కూడా ముఖ్యం. దీనికోసం మీరు స్టేట్ జ్యువెలరీ, సిల్వర్ జ్యువెలరీ వంటివి సెట్ చేసుకోవాలి. అయితే.. జ్యువెలరీని ఎక్కువగా కాకుండా.. లైట్‌గా ధరిస్తేనే బాగుంటుంది. పైన చెప్పిన మార్పులన్నీ పాటించారంటే.. మీరు ధరించింది నార్మల్ చీర అన్న సంగతే మరిచిపోతారు చూసేవారు!
కాన్ఫిడెంట్‌గా ఉండాలి : మీరు ఎలాంటి చీర ధరించారు..? ఎలాంటి నగలు పెట్టుకున్నారు? అనే విషయం ఒకెత్తయితే.. వాటిని ప్రదర్శించడం కూడా మరో ఎత్తు. మీరు చీరకట్టిన తర్వాత కంఫర్ట్‌గా ఫీలవ్వాలి. ఇబ్బంది పడకూడదు. ఇంకా.. కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎవరు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ అస్సలే ఉండొద్దు. ఇలాంటి ఆలోచనలు మీ మనసులో ఉంటే.. ఆ బెరుకు మీ ముఖంలో కనిపిస్తుంది. దాంతో.. మీ లుక్‌లో పర్ఫెక్షన్ దెబ్బ తింటుంది. ఈ సూచనలు పాటిస్తే.. నార్మల్ శారీ కూడా సూపర్బ్‌గా కనిపించదూ..! ఓ సారి ట్రై చేయండి.
Krithi Shetty Saree Photos : చీరలో కృతిశెట్టి సోకుల విందు.. అందం ఓవర్‌లోడెడ్!
మీ ఫేస్ కట్కు - ఎలాంటి బొట్టు బాగుంటుందో తెలియట్లేదా?