అయోధ్య రామాలయం బొమ్మతో వెండి ఉంగరం- ధర ఎంతంటే? Silver Ring Ram Mandir Replica :అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠ మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన జైలంగానియా అనే ఆభరణాల వ్యాపారి వెండి ఉంగరంపై అయోధ్య రామాలయ నమూనాను తీర్చిదిద్దారు. 22రోజుల వ్యవధిలో 24 గ్రాముల వెండిని ఉపయోగించి డిజిటల్‌గా తయారుచేసిన ఈ ప్రతిమ ధర మార్కెట్లో 8600 రూపాయలు.
వెండి ఉంగరంపై అయోధ్య రామాలయం నమూనా "నేను రామాలయ ప్రతిరూపాన్ని వెండితో తయారు చేశాను. అందులో బంగారం కూడా కలిపాను. ఇందులో హనుమాన్ విగ్రహం, రామ్ దర్బార్ కూడా ఉంది. 24 గ్రాముల స్వచ్ఛమైన వెండితో 22 రోజుల్లో తయారుచేశాను. కొన్ని సాఫ్ట్వేర్ల సాయంతో దీనిని రూపొందించా. చిన్న సైజులో తయారీకి కొంత సమయం పట్టింది."
--జై లంగానియా, బంగారం వ్యాపారి
అయోధ్యలో రామమందిరాన్ని రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్ట్ చంద్రకాంత్‌భాయ్ సోంపురాకు ఈ వెండి నమూనాను కానుకగా ఇవ్వాలనుకుంటున్నానని లంగానియా తెలిపారు.
అయోధ్య రామాలయం నమూనా రూపొందిస్తున్న జై లంగానియా "సోమ్‌నాథ్, స్వామి నారాయణ్ ఆలయం సహా 130 ఇతర దేవాలయాలతో పాటు రామమందిరాన్ని రూపొందించిన చంద్రకాంత్‌భాయ్ సోంపురాకు నేను ఈ విగ్రహాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను."
--జై లంగానియా, బంగారం వ్యాపారి
జనవరి 22న అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
వెండి ఉంగరంపై అయోధ్య రామాలయం నమూనా Ram Mandir Pran Pratistha :అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ సోమవారం కోరారు. మకర సంక్రాంతి నుంచి ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22 వరకు అన్ని దేవాలయాలను శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు. రామ భక్తులు, హిందువులు సహా భారతీయులందరూ ఇందులో పాల్గొనాలంటూ పేర్కొన్నారు.
వారం ముందు నుంచే పూజలు
జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారం రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభం కానున్నాయి. జనవరి 16న విగ్రహాన్ని చెక్కిన ప్రాంగణంలో పూజలు చేసి శిల్పిని సన్మానిస్తారని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి అశోక్ తివారీ చెప్పారు. 17న గర్భగుడిని సరయూ నదీ జలాలతో సంప్రోక్షన చేస్తారు. 18న గంధం, సుగంధితో, 19న ఉదయం ఫలాలతో సాయంత్రం చిరుధాన్యాలతో పూజలు చేస్తారు. 20న ఉదయం పూలతో సాయంత్రం నెయ్యితో రాముడికి పూజలు నిర్వహిస్తారు. 21న తేనె, స్వీట్లను అందించి రాముడిని నిద్రబుచ్చనున్నారు. అనంతరం 22న ప్రాణప్రతిష్ఠ జరిగే రాముడి కళ్లగంతలు విప్పి అద్దంలో చూపించనున్నారు.
వెయ్యి మందికి ఉచితంగా శ్రీరాముడి టాటూలు- భక్తిని చాటుకుంటున్న ఆర్టిస్ట్
అయోధ్య రామయ్యకు అత్తారింటి కానుకలు- విల్లు, పట్టు బట్టలు సైతం!