Ayyappa Swamy 18 Steps Significance in Telugu : కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మూడు నెలలు ఎక్కడ చూసిన అయ్యప్ప భక్తులే కనిపిస్తారు. కఠిన నియమ, నిష్ఠలతో 41 రోజుల పాటు మండల దీక్ష చేపడతారు. "స్వామియే శరణం అయ్యప్ప" అంటూ కోరిన కోర్కెలు తీర్చాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలిని ధృడసంకల్పంతో మణికంఠుని(Ayyappa Swamy)దీక్ష చేస్తారు.
SabarimalaAyyappa Swamy 18 Steps :ఇక పోతేస్వామి ఆలయం ముందున్న 18 మెట్లను ‘పదునెట్టాంబడి’ అంటారు. ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు 41 రోజులు మండల దీక్ష తీసుకుని ఇరుముడి తలపై పెట్టుకుని ఆ మెట్లు ఎక్కుతారు. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్ఠాన దేవత ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే.. ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామి వారి మెట్లు ఉంటాయి. అందుకు గల కారణాలేంటి? ఒక్కో మెట్టుకు ఉన్న విశిష్టత ఏంటి? అని.ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
18 మెట్లు ఎందుకంటే... మణికంఠుడు...అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువైయ్యేందుకు 4వేదాలు, 2శాస్త్రాలు, అష్టదిక్పాలకులు, విద్య, అవిద్య, జ్ఞానం, అజ్ఞానం అనే దేవతా రూపాలు 18 మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెబుతారు. పట్టబంధాసనంలో కూర్చుని చిన్ముద్ర, అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగసమాధిలోకి వెళ్లిన స్వామి.. జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెబుతున్నాయి.
18 మెట్ల అష్టాదశ దేవతలెవరంటే..1) మహంకాళి, 2) కళింకాళి, 3) భైరవ, 4) సుబ్రహ్మణ్యం, 5) గంధర్వరాజ, 6) కార్తవీర్య, 7) క్రిష్ణ పింగళ, 8) భేతాళ, 9) మహిషాసుర మర్దని, 10) నాగరాజ, 11) రేణుకా పరమేశ్వరి, 12) హిడింబ, 13) కర్ణ వైశాఖ, 14) అన్నపూర్ణేశ్వరి, 15) పుళిందిని, 16) స్వప్న వారాహి, 17) ప్రత్యంగళి, 18) నాగ యక్షిణి..