తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పంజాబ్​ పీసీసీ చీఫ్​గా కొనసాగనున్న సిద్ధూ..

నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన రాజీనామాను వెనక్కి తీసుకుని పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీతో ఆయన సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Sidhu
నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ

By

Published : Oct 15, 2021, 10:51 PM IST

పంజాబ్​ పీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీతో దిల్లీలో శుక్రవారం సమావేశమైన అనంతరం సిద్ధూ తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ విషయాన్ని భేటీలో పాల్గొన్న పంజాబ్​ ఏఐసీసీ ఇన్​ఛార్జ్​ హరీశ్​ రావత్​ వెల్లడించారు.

సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు సిద్ధూ. తన అభిప్రాయాలను రాహుల్​ గాంధీతో పంచుకున్నట్లు తెలిపిన సిద్ధూ.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని రాహుల్​ హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..

గత నెల 28న.. పంజాబ్​ రాష్ట్ర ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ (Sidhu news) రాజీనామా చేశారు. పంజాబ్ భవిష్యత్, సంక్షేమ అజెండా విషయంలో రాజీపడడం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు.

సంక్షోభంలో కూరుకుపోయిన పంజాబ్​ కాంగ్రెస్కు.. జులైలోనే పీసీసీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు​ చేపట్టారు సిద్ధూ.

ఇదీ చూడండి:'2024 ఎన్నికలకు ముందే అయోధ్య రాముని దర్శనం'

ABOUT THE AUTHOR

...view details