తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంతో భేటీకి నో- సిద్ధూతో మాత్రం సుదీర్ఘ చర్చలు! - Punjab Chief Minister Captain Amarinder Singh

పంజాబ్​ కాంగ్రెస్​లో సంక్షోభం నేపథ్యంలో.. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను దిల్లీలో కలిశారు ఎమ్మెల్యే నవ్​జ్యోత్​ సింగ్​ సిద్ధూ. అయితే.. 3 రోజులుగా దేశ రాజధానిలోనే ఉంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ను కలిసేందుకు పార్టీ అధిష్ఠానం ఆసక్తి కనబర్చకపోవడం గమనార్హం.

Sidhu meets Priyanka Gandhi amid Punjab crisis
ప్రియాంక గాంధీని కలిసిన సిద్ధూ

By

Published : Jun 30, 2021, 4:21 PM IST

పంజాబ్​ కాంగ్రెస్​ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే నవ్​జ్యోత్​ సింగ్​ సిద్ధూ.. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను దిల్లీలోని ఆమె నివాసంలో కలిశారు. అనంతరం.. ప్రియాంక గాంధీతో సుదీర్ఖ సమావేశం జరిగిందని ట్వీట్​ చేశారు.

ప్రియాంక గాంధీని కలిసిన సిద్ధూ

దిల్లీలో సిద్ధూను కలవనున్నట్లు వచ్చిన వార్తలను రాహుల్​ గాంధీ ఖండించిన మరుసటి రోజే సిద్ధూ.. ప్రియాంకను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సిద్ధూతో మాట్లాడిన తర్వాత ప్రియాంక.. రాహుల్​ గాంధీ ఇంటికి వెళ్లి ఆయనతో 45 నిమిషాల పాటు చర్చించారు. ఆ తర్వాత మళ్లీ సిద్ధూతో సమావేశం అయ్యారు.

అమరీందర్​కు నో అపాయింట్​మెంట్​!

ఇప్పటికే పంజాబ్​ కాంగ్రెస్​లో సంక్షోభాన్ని తొలగించేందుకు రెండు రోజులుగా పార్టీ నేతలతో సమావేశాలు జరుపుతున్నారు రాహుల్​. అయితే.. 3 రోజులుగా దిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కెప్టెన్​ అమరీందర్​ సింగ్​ను మాత్రం రాహుల్​ సహా పార్టీ అధిష్ఠానం కలవకపోవడం గమనార్హం.

పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. అమరీందర్​​పై కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తూ వస్తున్నారు సిద్ధూ. ఈ సమస్యను పరిష్కరించేందుకు గతంలో ఓ ప్యానెల్​ను ఏర్పాటు చేయగా.. ఆ కమిటీ ముందు కూడా సిద్ధూ హాజరయ్యారు.

ఇదీ చదవండి:సీఎం X సిద్ధూ: సంక్షోభంలోకి పంజాబ్‌ కాంగ్రెస్‌!

కలహాల బాటలో నేతలు- నివారించలేకపోతున్న అధిష్ఠానం

ABOUT THE AUTHOR

...view details