తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సోనియా నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉంది' - నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ వార్తలు తాజా

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీసుకున్న ఎలాంటి నిర్ణయమైనా తనకు ఆమోదయోగ్యమేనన్నారు ఆ పార్టీ నేత నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ. పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడి పదవికి సిద్ధూ రాజీనామాపై శుక్రవారం పార్టీ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Punjab Congress crisis
నవ్​జోత్​ సింగ్​ సిద్ధూ

By

Published : Oct 15, 2021, 4:54 AM IST

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తనకు పూర్తి విశ్వాసం ఉందనీ, ఆమె తీసుకున్న ఎలాంటి నిర్ణయమైనా ఆమోదయోగ్యమేనని పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూ చెప్పారు. సోనియా, రాహ్రుల్‌, ప్రియాంక ఏ నర్ణయం తీసుకున్నా అది పార్టీకి, పంజాబ్‌కు మేలు చేసేదే అవుతుందన్నారు. పదవికి రాజీనామా చేసిన ఆయన గురువారం ఏఐసీసీ కార్యాలయంలో సీనియర్‌ నేతలతో గంటసేపు భేటీ అయ్యారు.

ప్రభుత్వంలో, పార్టీలో కొన్ని నియామకాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సిద్ధూ రాజీనామా లేఖపై శక్రవారం పార్టీ తుది నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు- పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌తో నూతన సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఇదీ చూడండి :10,12 తరగతుల పరీక్షలపై సీబీఎస్​ఈ కీలక ప్రకటన

ABOUT THE AUTHOR

...view details