తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియాతో సిద్ధూ భేటీ.. అదే కారణమా?

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీతో.. దిల్లీలోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు పంజాబ్​ మాజీ మంత్రి నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. పార్టీలో సిద్ధూ తిరిగి క్రియాశీలక పాత్ర పోషించడంపై వీరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

Sidhu meets Congress chief Sonia Gandhi at her residence in Delhi
సోనియాతో సిద్ధూ భేటీ.. కారణం అదేనా?

By

Published : Feb 9, 2021, 5:22 AM IST

పంజాబ్​ మాజీ మంత్రి నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ.. దిల్లీలో కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. పార్టీలో తిరిగి క్రియాశీలక పాత్ర పోషించడంపై సోనియాతో ఆమె నివాసంలో జరిగిన సమావేశంలో.. సిద్ధూ చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో పంజాబ్​ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరీశ్​ రావత్​, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి కే.సీ వేణుగోపాల్​లు కూడా పాల్గొన్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

మంత్రి​ పదవి..!

2019లో పంజాబ్​ పర్యటక మంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం సిద్ధూ.. రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే తాజాగా జరిగిన చర్చల అనంతరం.. తిరిగి కేబినెట్​ మంత్రి హోదాను ఆయన స్వీకరిస్తారని సమాచారం. గతంలో.. ఆయన చేపట్టిన పదవినే సిద్ధూకు తిరిగి ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటికే.. పంజాబ్​ ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​తో భేటీ అయ్యారు సిద్ధూ.

2022లో రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న తరుణంలో.. సిద్ధూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించడం కాంగ్రెస్​కు కలిసి వచ్చే విషయం.

పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్​ పదవి చేపట్టేందుకు సిద్ధూ యోచిస్తున్నట్టు.. అయితే ఆయనకు ఆ బాధ్యతలు అప్పగించేందుకు అమరిందర్​ సింగ్​ విముఖంగా ఉన్నట్టు సమాచారం.

ఇదీ చూడండి:-ఇకపై క్రియాశీల రాజకీయాల్లో ఉంటా: చిన్నమ్మ

ABOUT THE AUTHOR

...view details