Sidharth Luthra Tweet: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతను చేసిన ఓ ట్వీట్ ఆసక్తిగా మారింది. దీంతో ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు. ఈ ట్వీట్లో గురు గోవింద్ సింగ్ సూక్తులు ప్రస్తావించారు.
Supreme Court Lawyer Sidharth Luthra Tweet: సిద్ధార్థ లూథ్రా ఆసక్తికర ట్వీట్ చేశారు. అన్ని ప్రయత్నాలు చేసినా.. న్యాయం కనుచూపు మేర లేకుంటే ఇక కత్తి పట్టడమేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పోరాటానికి ఇదే సరైన విధానమంటూ గురుగోవింద్ సింగ్ ప్రవచనాన్ని పేర్కొన్నారు. నేటి సూక్తి అంటూ సిద్ధార్థ లూథ్రా చేసిన ఈ ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశమైంది.
Rajinikanth phone call to Lokesh : తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చంద్రబాబును ఏమీ చేయలేవు..
Siddharth Luthra Meet Chandrababu Naidu: రాజమహేంద్రవరంలో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిని కలిశారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాలు చర్చించారు. క్వాష్ పిటిషన్ హైకోర్టు వాయిదా వేయడంతో.. జరిగిన పరిణామాలపై వివరించారు. చంద్రబాబును కలిసిన అనంతరం తిరిగి లూథ్రా.. లోకేశ్ వద్ద కొద్దిసేపు గడిపి విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Chandrababu Petition in High Court: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 19కి హైకోర్టు వాయిదా వేసింది. విచారణను క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరడంతో.. అందుకు హైకోర్టు అంగీకరించింది.