SIDBI Recruitment 2023 Notification :స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్(SIDBI) అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతలు, అప్లికేషన్ ఫీజు, దరఖాస్తు విధానం , అప్లైకు చివరి తేదీ తదితర వివరాలు మీ కోసం.
పోస్టు పేరు : అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఏ
- ఉద్యోగాల సంఖ్య : 50
- అర్హతలు : ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా కళాశాల నుంచి డిగ్రీలో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత చెంది ఉండాలి.
- ఎస్.సి/ఎస్.టి /పీడబ్లూడి అభ్యర్థులు కనీసం 55% శాతం మార్కులతో గుర్తింపు పొందిన కళాశాల నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత చెంది ఉండాలి.
- లేదంటే CA/CS/CWA/CFA/CMA వీటిలో ఏదైనా ఒక విద్యార్హత కలిగి యుండాలి.
- లేదా LAW లో డిగ్రీ చేసి ఉండాలి/ఇంజినీరింగ్ అభ్యర్థులు కనీసం 60% మార్కులతో పూర్తిచేసి ఉండాలి. ఎస్.సి/ఎస్.టి /పీడబ్లూడి అభ్యర్థులు కనీసం 55% మార్కులతో గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
గరిష్ఠ వయోపరిమితి 30 ఏళ్లు
- ఉద్యోగానుభవం
షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు /ఆలిండియా ఫైనాన్సియల్ సంస్థలు( పర్సనల్, ఎడ్యుకేషన్, వెహికల్ లోన్లు విషయంలో తప్ప) 2 సంవత్సరాలు పనిచేసి ఉండాలి. లేదా 3 సంవత్సరాల పాటు ముఖ్యమైన ఎన్బీఎఫ్సీ సంస్థల్లో MSME లెండింగ్/ కార్పొరేట్ లెండింగ్ విభాగాల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి.
అప్లికేషన్ ఫీజు
- OBC/EWS/జనరల్ అభ్యర్థులకు రూ.1100
- SC/ST/PWBD అభ్యర్థులకు రూ.175
- పేమెంట్ విధానం : పేమెంట్ గేట్వే ద్వారా చెల్లించాలి.
ఎంపిక విధానం
ఆన్లైన్ సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కసన్, పర్సనల్ ఇంటర్య్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.