ఆస్పత్రుల్లో ఉండాల్సిన కరోనా రోగులు.. రావి చెట్టు కింద ఆశ్రయం పొందుతున్నారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్ శాహ్జహాపుర్ జిల్లా తిల్హర్ పట్టణం పరిసర ప్రాంతంలో జరిగింది. రావి చెట్టు కింద కరోనా రోగులు ఉన్నారన్న సమాచారం అందుకున్న తిల్హర్ భాజపా ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ ఆ ప్రాంతానికి వెళ్లి పరీక్షించారు.
"నేను అక్కడికి వెళ్లగా.. దాదాపు 8 నుంచి 9 మంది చెట్టు కింద చాపలు పరుచుకుని ఉన్నారు. నన్ను చూడగానే.. పోలీసులు అరెస్టు చేస్తారని భావించి.. కొంత మంది పారిపోయారు. ఐదారు రోజులుగా వారు ఇక్కడే ఉంటున్నారు."
-రోషన్ లాల్ వర్మ, తిల్హర్ ఎమ్మెల్యే
ఈ విషయం గురించి వైద్య విద్యా శాఖ మంత్రి సురేశ్ ఖన్నాను తాను సంప్రదించడానికి ప్రయత్నించానని ఎమ్మెల్యే రోషన్ లాల్ వర్మ తెలిపారు. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదని చెప్పారు.
నెగెటివ్ వచ్చినా..
ఆక్సిజన్ కోసం రావి చెట్టు కింద పడకలు ఏర్పాటు చేసుకున్నామని రవీంద్ర మౌర్య అనే వ్యక్తి తెలిపారు. తన సోదరికి కరోనా నెగెటివ్ వచ్చినా.. కొవిడ్ వార్డులో చేర్పించారని ఆరోపించారు.