పాము కాటుకు(snake bite news) గురై ప్రాణాలు కోల్పోయిన తమ్ముడి అంత్యక్రియలకు హాజరైన అతని సోదరి సైతం అదే పాము కాటుకు బలైంది. ఈ విషాద సంఘటన మహారాష్ట్ర సాంగలీ జిల్లాలో జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే తోబుట్టువులు ఒకే పాము కాటుకు(snake bite treatment) గురికావటం వారి గ్రామంలో కలకలం సృష్టించింది.
ఏం జరిగింది..?
జిల్లాలోని ఖానాపుర్ తాలూకా ఆల్సంద్ గ్రామానికి చెందిన రైతు సునిల్ కదమ్ ప్రస్తుతం టైలరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అక్టోబర్ 6న అతని కుమారుడు విరాజ్ సునిల్ కదమ్(16).. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పాము కాటు వేసింది. తెల్లవారే వరకు అతనికి ఏం జరిగిందో తెలుసుకోలేకపోయారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత ఉదయం ఆసుపత్రికి తీసుకెళ్లే దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు.
సోదరుడి అత్యక్రియలకు హాజరైన పెద్ద కూతురు సాయలీ జాదవ్(22)ను అక్టోబర్ 8న అదే పాము కాటు వేసింది. ఆమెను ముందుగా స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి(snake bite treatment) తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ.. అక్టోబర్ 15న ప్రాణాలు కోల్పోయింది. ఆమెకు ఏడాది వయసున్న కూతురు ఉంది.
ఇదీ చూడండి:వంట పాత్రలో మండపానికి వధూవరులు- వరద మధ్యే పెళ్లి