తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా ఎన్నికల్లో కర్ణాటకవాసి ఘన విజయం

అమెరికా మిషిగన్ ప్రతినిధుల సభకు ఓ భారతీయుడు ఎన్నికయ్యాడు. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ తానేదార్ డెమొక్రాట్ల తరఫున 90 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. శ్రీనివాస్ విజయంతో ఆయన స్వస్థలం బెలగావీలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

Shrinivas Thanedar elected to Michigan Legislative
శ్రీనివాస్ తానేదార్ అమెరికా ఎన్నికల్లో విజయం

By

Published : Nov 8, 2020, 12:52 PM IST

అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయులు సత్తా చాటారు. మిషిగన్​ లెజిస్లేటివ్​ ఆఫ్ రిప్రజెంటేటివ్స్​​కు.. కర్ణాటకకు చెందిన శ్రీనివాస్ తానేదార్ (65) డెమొక్రాట్​ పార్టీ నుంచి 90 శాతానికిపైగా ఓట్లతో ఎన్నికయ్యారు. ​ శ్రీనివాస్ తానేదార్ స్వస్థలం బెలగావిలోని మీరా​పూర్​. శ్రీనివాస్​ తానేదార్ గెలుపుపై బెలగావీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

శ్రీనివాస్​ జీవిత విశేషాలు..

శ్రీనివాస్​ పుట్టిపెరిగిందంత బెలగావీలోనే. గేయ రచయితగా, శాస్త్రవేత్తగా అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగా ఆయన సుపరిచితులు. ఈయన విద్యాభ్యాసమంతా చింతామన్​రావ్​ ప్రభుత్వ పాఠశాలలో సాగింది.

1977లో బాంబే యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పీజీ పట్టాను పొందారు శ్రీనివాస్. ఆపై ఉన్నత చదువులకోసం 1979లో అమెరికాకు వెళ్లారు. 1982లో పాలిమర్​ కెమిస్ట్రీలో పీహెచ్​డీ పట్టాను పొందారు. 1982-84 మధ్య యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్​లో ప్రొఫెసర్​గా పని చేశారు.

ఆటుపోట్లు..

శ్రీనివాస్​ తానేదార్​ 18 ఏళ్ల వయస్సులో బ్యాంకర్​గా పని చేశారు. ఆ సమయంలో ఎంఎస్​ఈ చేయాలని భావించారు. అయితే అందుకు కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది అంగీకరించలేదు. అయినప్పటికీ ఎంఎస్​ఈ చేయాలనే పట్టుదలను మాత్రం వదలలేదు. ఆ ప్రయత్నంలో ఉద్యోగాన్ని కూడా కోల్పోయారాయన.

ఇదీ చూడండి:'కమల వికాసం'తో ఆ రెండు గ్రామాల్లో ముందే దీపావళి

ABOUT THE AUTHOR

...view details