Shri Ram Vigraha Prana Pratishtha And Related Events : అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హిందూ సంప్రదాయాలు, ఆచారాల ప్రకారం ఈ క్రతువులను నిర్వహించనున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం మంగళవారం పరిహార క్రతువును నిర్వహించనుంది. అలాగే సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణుపూజ, గో సమర్పణ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జనవరి 18న శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు వచ్చే అభిజిత్ ముహూర్తాన విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేస్తారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు.
శ్రీరామ దర్శనం
శ్రీరాముని విగ్రహం బరువు 150-200 కిలోల వరకు ఉంటుందని సమాచారం. 121 మంది ఆచార్యులు ఈ క్రతువు నిర్వహిస్తారని రామజన్మభూమి కార్యదర్శి చంపత్‌రాయ్ తెలిపారు. కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యుడిగా ఈ క్రతువును నిర్వహిస్తారని వెల్లడించారు. 150కిపైగా సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన చెప్పారు. ఈ జనవరి 23 నుంచి భక్తులు అందరూ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠకు ముందు నిర్వహించే కార్యక్రమాలు
శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ పౌష్ శుక్ల కుర్మ ద్వాదశి, విక్రమ సంవత్సరం 2080 అంటే, 2024 జనవరి 22 (సోమవారం) రోజున జరుగుతుంది. విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందు నిర్వహించే పవిత్ర కార్యక్రమాలు జనవరి 16 నుంచి 21 వరకు జరగనున్నాయి.
- జనవరి 16 : ప్రాయశ్చిత్త, కర్మకుటి పూజ
- జనవరి 17 : దేవాలయ ప్రాంగణంలోకి విగ్రహ ప్రవేశం
- జనవరి 18 (సాయంత్రం) : తీర్థ పూజ, జలయాత్ర, జలధివాస్, గంధ ధివాస్
- జనవరి 19 (ఉదయం) : ఔషధ ధివాస్, కేశర ధివాస్, ఘృతాధివాస్
- జనవరి 19 (సాయంత్రం) : ధాన్యాధివాస్
- జనవరి 20 (ఉదయం) : శక్రాధివాస్, ఫలధివాస్
- జనవరి 20 (సాయంత్రం) : పుష్పాధివాస్
- జనవరి 21 (ఉదయం) : మధ్యాధివాస్
- జనవరి 22 (సాయంత్రం) : శయ్యాధివాస్