తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ ఎముకలు శ్రద్ధావే.. DNA నివేదికలో వెల్లడి.. త్వరలో హత్య సీన్​ రీక్రియేట్​! - శ్రద్ధావాకర్​్​ ఎముకలు

దిల్లీ శివారులోని అటవీప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎముకలు టెలీకాలర్‌ శ్రద్ధావాకర్‌వేనని తేలింది. డీఎన్​ఏ పరీక్షల్లో ఈ విషయం నిర్ధారణ అయినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. మృతురాలి ఎముకలు.. ఆమె తండ్రి వికాస్‌ వాకర్‌ డీఎన్​ఏతో సరిపోలినట్లు పేర్కొన్నాయి. పోలీసుల ఇంటరాగేషన్‌లో హత్య చేసినట్లు అంగీకరించిన నిందితుడు ఆఫ్తాబ్‌.. అతను ఇచ్చిన సమాచారం మేరకు శ్రద్ధా ఎముకలు, హత్యకు ఉపయోగించిన కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనల క్రమాన్ని పునర్నిర్మించి వాటిని ఆధారాలుగా చూపే అవకాశం ఉంది.

shradha murder case
shradha murder case

By

Published : Dec 15, 2022, 3:17 PM IST

Shraddha Walker Case: దేశ రాజధాని దిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్‌ హత్య కేసు దర్యాప్తులో మరింత స్పష్టత వచ్చింది. హస్తిన శివారులోని మెహరోలీ, గురుగ్రామ్‌ అటవీ ప్రాంతంలో లభ్యమైన ఎముకలు శ్రద్ధా వాకర్‌వేనని.. డీఎన్​ఏ పరీక్షల్లో తేలింది. శ్రద్ధా ఎముకల నమూనాలు.. మృతురాలి తండ్రి వికాస్‌ వాకర్‌ డీఎన్​ఏతో సరిపోలినట్లు సంబంధితవర్గాలు తెలిపాయి.

ఈ ఏడాది మేలో శ్రద్ధావాకర్‌ను హత్య చేసిన ఆమె ప్రియుడు ఆఫ్తాబ్‌ పూనావాలాను నెలక్రితం పోలీసులు అరెస్ట్‌ చేశారు. డేటింగ్‌ యాప్‌ ద్వారా కలిసిన శ్రద్ధావాకర్‌, ఆఫ్తాబ్‌ పూనావాలా.. దిల్లీకి మకాం మార్చటానికి ముందు కొన్నినెలలపాటు ముంబయిలో సహజీవనం చేశారు. మే 18న శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్‌ హతమార్చాడు. ఐతే శ్రద్ధా తండ్రి అక్టోబర్‌లో ముంబయి పోలీసులను ఆశ్రయించటం వల్ల.. ఈ హత్యోందంతం వెలుగులోకి వచ్చింది.

ఈ ఏడాది మే లో శ్రద్ధావాకర్‌ను హత్య చేసిన ఆఫ్తాబ్‌.. ఆమె శరీరభాగాలను 35 ముక్కులుగా నరికి దిల్లీ అద్దె ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో ఉంచాడు. ఆ తర్వాత శ్రద్ధా శరీర భాగాలను 18 రోజులపాటు మెహరోలీ, గురుగావ్‌ అటవీ ప్రాంతంలో పారేశాడు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. నిందితుడు ఇప్పటివరకు శ్రద్ధావాకర్‌ హత్యకు ఉపయోగించిన కత్తులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఇంటరాగేషన్‌లో ఆమెను హత్యను చేసినట్లు అంగీకరించిన ఆఫ్తాబ్‌.. అతను ఇచ్చిన సమాచారం మేరకు పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. అటవీ ప్రాంతంలో లభించిన ఎముకలు శ్రద్ధావే అని తేలడంలో కీలక ఆధారాలు పోలీసులకు దక్కినట్లైంది. ఆఫ్తాబ్‌కు నార్కో, పాలిగ్రాఫ్‌ పరీక్షలు కూడా పోలీసులు నిర్వహించారు. హత్యకు ముందు తర్వాత ఘటనల క్రమాన్ని పునర్నిర్మించటం ద్వారా వాటిని సాక్ష్యాలు చూపించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details