తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి అయిన నెలరోజుల్లోనే భర్తను చంపిన భార్య.. చైనా డోర్​ తగిలి బాలుడు మృతి - మహారాష్ట్ర హత్య కేసు

పెళ్లై నెలరోజులైనా గడవకముందే ఓ నవవధువు తన భర్తను హత్య చేసింది. అనంతరం తన అత్తవారి కుటుంబ సభ్యలకు తన భర్త బెడ్​ రూమ్​లో కళ్లు తిరిగి పడిపోయాడని చెప్పింది. ఈ విషయంలో వధువుపై అనుమానంతో కేసు నమోదు చేయగా.. పోలీసులకు షాకింగ్​ నిజాన్ని వెల్లడించింది. మరో ఘటనలో ఓ దుకాణదారుడు తన ఇంట్లో ఉన్న ఫ్రిజ్​లో శవమై కనిపించాడు. ఈ దారుణం యూపీలో జరిగగా.. పంజాబ్​లో చైనా డోర్​ మీద పడి ఓ 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.

Shopkeeper dead body in deep freezer
పెళ్లై నెలరోజుల్లోనే భర్తను చంపిన భార్య

By

Published : Nov 14, 2022, 1:31 PM IST

మహారాష్ట్రలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. పెళ్లై నెలరోజులైనా కాకముందే ఓ నూతన వధువు తన భర్తను గొంతునులిమి హత్యచేసింది. నవంబర్​ 7న ఈ హత్య జరగగా.. పోలీసులు నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆరు రోజుల అనంతరం పోలీసులకు ఆ నవవధువు తానే భర్తను హత్య చేసినట్లు తెలిపింది. అసలు ఏం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నబేకాలోని నిపాణి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల పాండురంగ రాజాభౌ చావన్​కు పోలచీవడి ప్రాంతానికి చెందిన శీతల్​ అనే యువతితో..అక్టోబర్​ 14న వివాహం జరిగింది. అయితే నవంబర్​ 7న రాత్రి 11.30 గంటల సమయంలో శీతల్​ తన బెడ్​ రూమ్​ నుంచి బయటకు వచ్చి పాండురంగ సృహతప్పి పడిపోయాడని తన అత్తకు, బంధువులకు చెప్పింది. వెంటనే కుటుంబసభ్యులు.. పాండురంగ​ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పాండురంగ​ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పాండురంగ​ గొంతుపైన కొన్ని గాయాలు ఉన్నందున తమ కోడలే హత్య చేసి ఉంటుందని మృతుడి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై మృతుడి తల్లి నీలాబాయి రాజాభౌ చావన్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు శీతల్​ను 6 రోజుల పాటు విచారించారు. విచారణలో పాండురంగను తానే హత్య చేసినట్లు శీతల్​ తెలిపింది. తనకు పాండురంగ అంటే ఇష్టం లేనందునే హత్య చేసినట్లు వెల్లడించింది. నిందితురాలిపై పోలీసులు సెక్షన్​ 302 కింద కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

భార్య చేతిలో మృతి చెందిన పాండురంగ

డోర్​ మీదపడి 13 ఏళ్ల బాలుడు మృతి..
చైనా డోర్​ మీద పడి 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ దారుణం పంజాబ్​లో​ జరిగింది. రూప్​నగర్​ మజ్రీ కోట్లా ప్రాంతంలోని నిహాంగ్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ డోర్​ ఎగురుకుంటూ వచ్చి.. గుల్హాన్స్​ అనే 13 ఏళ్ల బాలుడిపై పడింది. దీంతో బాలుడు గొంతుపై తీవ్రంగా గాయమైంది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుల్హాన్స్​ పరిస్థితి విషమించగా.. చండీగఢ్​లోని మరో ఆస్పత్రికి తరలించారు. అయితే.. గుల్హాన్స్​కు గొంతుపై తీవ్రంగా గాయమై.. అధిక రక్తస్రావం అయినందున చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ప్లాస్టిక్​ డోర్​లను నిషేధించాలని.. పంజాబ్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేస్తున్నారు. ఇకపై వాటి ద్వారా మరొకరికి హాని కలగకుండా చూడాలని కోరారు.

దుకాణదారుడి హత్య..
ఉత్తర్​ప్రదేశ్​లో ఓ దుకాణదారుడు హత్యకు గురైయ్యాడు. తన ఇంట్లో ఉన్న ఫ్రిజ్​లో శవమై కనిపించాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ హత్యకు సంబంధించి అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కాన్పుర్​లోని ఖండేశ్వర్​ గ్రామానికి చెందిన 52 ఏళ్ల కుబేర్​ సింగ్​ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. కుబేర్​ భార్య 15 ఏళ్ల క్రితం మరణించింది. ఇటీవల కుమారైకు వివాహం జరిపించాడు. ప్రస్తుతం తన మేనల్లుడితో ఉంటున్నాడు. అయితే తన మేనల్లుడు ఉద్యోగ రీత్యా ఎక్కువ రోజులు బయటనే ఉంటాడు. కుబేర్​ గత నాలుగు రోజులుగా తన దుకాణం తెరవలేదు. ఇంటి వద్ద కూడా కనిపించనలేదు. గ్రామస్థులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే కుబేర్​ కుటుంబీకులు ఇంటిని చేరుకుని పరిశీలించగా ఫ్రిజ్​లో మృతదేహం కనిపించింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫ్రిజ్​లో శవమై కనిపించిన దుకాణదారుడు

ABOUT THE AUTHOR

...view details