తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'స్మృతి ఇరానీ అనుచరులు డబ్బులు అడిగారు' - షూటర్ వర్తికా సింగ్ ఆరోపణలు

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరులిద్దరు... తనను కేంద్ర మహిళా కమిషన్​ సభ్యురాలిని చేస్తానని చెప్పి లంచం అడిగారని ఆరోపించారు షూటర్​ వర్తికా సింగ్. తనతో అసభ్యంగా మాట్లాడారని చెప్పి ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Shooter Vartika Singh moves court against Smriti Irani and 2 others
'స్మృతి ఇరానీ అనుచరులు డబ్బులు అడిగారు'

By

Published : Dec 26, 2020, 7:29 AM IST

తనను కేంద్ర మహిళా కమిషన్‌ సభ్యురాలిని చేస్తామంటూ.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అనుచరులిద్దరు డబ్బులు డిమాండ్‌ చేశారని ఆరోపిస్తూ అంతర్జాతీయ షూటర్‌ వర్తికాసింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

మంత్రి అనుచరులైన విజయ్‌ గుప్త, రజనీశ్‌ సింగ్‌లు తనను తొలుత కోటి రూపాయలు డిమాండ్‌ చేశారని, తర్వాత రూ. 25 లక్షలకు దిగివచ్చారని వర్తికా సింగ్ పేర్కొన్నారు. వారిలో ఒకరు తనతో అసభ్యంగా కూడా మాట్లాడినట్లు ఆరోపించారు. ఈమేరకు సుల్తాన్‌పుర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు జనవరి 2న విచారణకు నిర్ణయించినట్లు వర్తికాసింగ్‌ తరఫు న్యాయవాది తెలిపారు.

గత నెలలో వర్తికాసింగ్‌తో పాటు మరొకరిపై విజయ్ గుప్త.. అమేఠీ జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే వారి అవినీతిని బయటపెడతానని హెచ్చరించినందుకే తనపై ఫిర్యాదు చేసినట్లు వర్తికా చెబుతున్నారు.

ఇదీ చదవండి:'పైప్​ కంపోస్ట్'​తో చెత్త నుంచి సిరుల పంట

ABOUT THE AUTHOR

...view details