తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఫ్రెండ్​ని కత్తితో పొడిచి బండరాయితో మోదిన యువకుడు - మిత్రుల మధ్య ఘర్షణ

వారిద్దరూ స్నేహితులు. అప్పటివరకు హాయిగా.. కలిసి కూర్చుని మద్యం సేవించారు. అంతలో ఏదో విషయంలో వాగ్వాదం చెలరేగింది. అది ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్లింది. అసలేమైందంటే..?

friends fighting
స్నేహితుల మధ్య గొడవ

By

Published : Aug 15, 2021, 8:42 PM IST

స్నేహితుల మధ్య ఘర్షణ దృశ్యాలు

అప్పటివరకు కలిసి మద్యం సేవించిన ఇద్దరు స్నేహితులు.. బద్ధ శత్రువులుగా మారారు. ఒకరినొకరు చంపుకోవాలని యత్నించారు. తమిళనాడు చెన్నైలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఏం జరిగిందంటే..?

చెన్నై తొందియార్​పేట్​లోని రేషన్​ షాపు వెనకాల స్నేహితులైన అజయ్​(24), సంతోష్​(22).. ఆగస్టు 8న మద్యం సేవించారు. అయితే.. అక్కడ ఏదో విషయంలో తగాదా రాగా.. అజయ్​ కత్తితో సంతోష్​​ను పొడిచాడు. దాంతో ఆగ్రహానికి గురైన సంతోష్​.. అతడి​ చేతిలోంచి అదే కత్తిని లాక్కుని అజయ్​ను పొడిచి, అక్కడి నుంచి పరారయ్యాడు.

మరో స్నేహితుడొచ్చి..

అనంతరం.. ఈ గొడవ విషయాన్ని సంతోష్​ తన మరో స్నేహితుడైన శేఖర్​కు తెలియజేశాడు. అజయ్​ను తన స్నేహితులు.. ఆస్పత్రికి తరలిస్తుండగా.. సంతోష్​ తన స్నేహితుడు శేఖర్​తో కలిసి అక్కడకు వచ్చాడు. కోపంతో ఉన్న శేఖర్​.. అజయ్​ను బండ రాయితో మోదాడు.

తీవ్రంగా గాయపడ్డ అజయ్​ను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి:సరిహద్దులో 'ఐ లవ్ పాకిస్థాన్' బెలూన్ల కలకలం

ఇదీ చూడండి:21 రకాల 10 రూపాయల నాణేలతో యువకుడి రికార్డు

ABOUT THE AUTHOR

...view details