Husband murdered his wife: ఒడిశాలోని ఢెంకనాల్లో దారుణం జరిగింది. భార్యను అత్యంత పాశవికంగా హత్య చేశాడు ఓ భర్త. భార్య తల నరికి చేతిలో పట్టుకుని సమీపంలోని పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తల చేతిలో పట్టకుని నడుస్తున్న దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. నకపోడి మఝీ, శుచల దంపతులు గండియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్పుర్లో నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే భార్యపై కోపం పెంచుకున్న భర్త.. ఆమె తలను గొడ్డలితో నరికాడు.
అనంతరం తలను పట్టుకోని 12 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్కు వీధుల్లో నడుస్తూ వెళ్లాడు. ఈ క్రమంలో అతడిని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. తలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య తనను మోసం చేసిందేమో అని నిందితుడు అనుమానించి ఉండవచ్చని.. అదే హత్యకు దారి తీసిందని పోలీసులు అభిప్రాయపడ్డారు.