తమిళనాడు తిరుచ్చిలో విషాదం జరిగింది. కూతురు కళ్లముందే తండ్రిని కిరాతకంగా హతమార్చారు కొందరు దుండగులు. భీమ్నగర్కు చెందిన న్యాయవాది గోపి కణ్నన్.. తన ఇంటి వద్ద కూతురికి సైకిల్ నేర్పిస్తుండగా ఐదుగురు దుండగులు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు. నడిరోడ్డుపైనే కొట్టి చంపారు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీల్లో రికార్డయ్యాయి.
కూతురు కళ్లముందే తండ్రిని చంపిన దుండగులు - tamilnadu trichy brutal murder
కూతురు కళ్లముందే తండ్రిని హత్య చేసిన దారుణమైన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో జరిగింది. మరణించిన వ్యక్తిని న్యాయవాది గోపి కణ్నన్గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కూతురు కళ్లముందే తండ్రిని చంపిన దుండగులు
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి :గంగానదిలో తేలిన 50మృతదేహాలు.. ఏం జరిగింది?