తమిళనాడు చెన్నైలో ఓ యువకుడు కంటైనర్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి.
అంతా క్షణాల్లోనే..
తమిళనాడు చెన్నైలో ఓ యువకుడు కంటైనర్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాలలో నిక్షిప్తమయ్యాయి.
అంతా క్షణాల్లోనే..
కల్యాణ చెట్టి ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్(25) ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతడు తొలుత.. తిరువొట్టియూర్-ఎన్నోర్ ఎక్స్ప్రెస్వే కుడివైపు నుంచి అటుగా వచ్చే వాహనాలన్నింటినీ దాటి మధ్యలోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ రోడ్డు దాటేందుకు ప్రయత్నించగా ఇంతలో ఓ కంటైనర్ రావడం వల్ల వెనక్కి వెళ్లాడు. ఉన్నట్టుండి క్షణాల్లోనే దాని వెనకాల చక్రాల కిందపడగా.. అతడిపై నుంచి వెళ్లిందా ట్రక్కు. దీంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు వినోద్. స్థానిక సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. శవపరీక్ష కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.