తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​కు కేంద్రం షాక్​- మమత తీవ్ర అభ్యంతరం - బంగాల్​ ప్రభుత్వం

Mamata Writes to Modi: బంగాల్​ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం షాక్​ ఇచ్చింది. రిపబ్లిక్​ డే పరేడ్​ కోసం దీదీ సర్కార్​ పంపిన నేతాజీ శకటం నమూనాను తిరస్కరించింది. దీనిపై సీఎం మమతా బెనర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Mamata writes to Modi
Mamata writes to Modi

By

Published : Jan 16, 2022, 9:15 PM IST

Mamata Writes to Modi: గణతంత్ర దినోత్సవ పరేడ్‌ కోసం బంగాల్‌ ప్రభుత్వం పంపిన నేతాజీ శకటం నమూనాను కేంద్రం తిరస్కరించింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేంద్రప్రభుత్వ నిర్ణయంపై బంగాల్‌ ప్రజలు బాధపడుతున్నారని ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. నేతాజీ 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని.. సుభాష్‌ చంద్రబోస్‌, ఆయన స్థాపించిన ఐఎన్​ఏ చేసిన సేవలను స్మరించుకునే ఉద్దేశంతో నమూనా శకటం పంపినట్లు తెలిపారు.

బంగాల్​ శకటం నమూనాను తిరస్కరించటానికి గల కారణాలు కూడా.. వెల్లడించలేదని దీదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించి 75 ఏళ్ల స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల వేళ జరిగే గణతంత్ర పరేడ్‌లో బంగాల్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధుల శకటాన్ని చేర్చాలని కోరారు.

ఇవీ చూడండి: గోవా రణక్షేత్రంలో దీదీ పోరు- గెలిచి నిలిచేనా?

స్కూళ్లలోకి ఆ పిల్లలకు నో ఎంట్రీ- ప్రభుత్వం హెచ్చరిక!

ABOUT THE AUTHOR

...view details