తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్యాంగ్​ రేప్ కేసు నమోదుకు ఎస్సై నిరాకరణ.. చివరకు... - యువతిపై గ్యాంగ్​ రేప్​

Gang rape victim: కళాశాలకు వెళుతున్న యువతిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన ఎస్సైని సస్పెండ్​ చేశారు అధికారులు. ఈ ఘటన రాజస్థాన్​, భరత్​పుర్​ జిల్లాలో జరిగింది.

gangrape case
యువతిపై గ్యాంగ్​ రేప్

By

Published : Dec 4, 2021, 6:36 PM IST

Gang rape victim: ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేస్తే.. కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన ఎస్సైని సస్పెండ్​ చేశారు ఉన్నతాధికారులు. ఈ ఘటన రాజస్థాన్​, భరత్​పుర్​ జిల్లాలో జరిగింది.

ఏం జరిగింది?

నవంబర్​ 29న ఓ 19 ఏళ్ల యువతి కళాశాలకు వెళుతున్న క్రమంలో ఇద్దరు దుండగులు ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు. భయంతో ఆ రోజు ఎవరికీ చెప్పలేదు బాధితురాలు. మరుసటి రోజున తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. జిల్లాలోని ఉచై పోలీస్​ స్టేషన్​కు ఈనెల 2న ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. వారికి అనూహ్య పరిణామం ఎదురైంది.

"స్టేషన్​ హౌస్​ ఆఫీసర్​ శ్రావణ్​ పాఠక్​ కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. బాధితురాలు కుటుంబ సభ్యులు శుక్రవారం ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేశారు. గ్యాంగ్​ రేప్​పై కేసు నమోదు చేశాం. ఎస్​హెచ్​ఓను సస్పెండ్​ చేశాం."

- దేవేంద్ర బిష్ణోయ్​, జిల్లా ఎస్పీ

యువతిపై అత్యాచారం కేసులో దర్యాప్తు చేపట్టామని, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్​ చేయలేదని చెప్పారు ఎస్పీ.

ఇదీ చూడండి:భార్య, పిల్లలను చంపేసిన డాక్టర్- కరోనా నుంచి విముక్తి కోసమని...

ABOUT THE AUTHOR

...view details