తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ చెప్పిన మంచి రోజు ఇదేనా?' - shiva sena vs bjp

భాజపాపై శివసేన ధ్వజమెత్తింది. సామ్న పత్రిక సంపాదకీయంలో కేంద్రం వైఖరిపై తీవ్ర విమర్శలు చేసింది. పెట్రోల్ ధరల పెంపుపై తీవ్రస్థాయిలో మండిపడింది. 'ఇదేనా మోదీ చెప్పిన మంచి రోజు?' అని ప్రశ్నించింది.

shivsena, శివసేన
ఇంధన ధరలు పెంపుపై శివసేన ధ్వజం

By

Published : Feb 22, 2021, 9:50 AM IST

దేశంలో పెరుగుతున్న ఇంధన, గ్యాస్‌ ధరలపై కేంద్రం తీరును శివసేన ఘాటు విమర్శలు చేసింది. లీటర్ పెట్రోల్ ధర వంద దాటించిన కేంద్రం.. అందుకు కాంగ్రెస్‌దే బాధ్యతంటూ నిందలు మోపుతున్నారని శివసేన తమ పత్రిక సామ్నా సంపాదకీయంలో ధ్వజమెత్తింది. కాంగ్రెస్ హయాంలో పెట్రోలియం పంపిణీ సహా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు చేస్తే.. మోదీ ప్రభుత్వం వాటిని విక్రయించేస్తోందని దుయ్యబట్టింది. పెట్రోల్ ధరల పెంపు వల్ల అన్ని వస్తువుల ధరలు ఆకాశన్ని అంటుతున్నాయని శివసేన సామ్నాలో పేర్కొంది.

ఎవరైనా మోదీని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశ ద్రోహాలుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. ముంబయిలోని ప్రధాన కూడళ్లు, పెట్రోల్‌ బంకుల వద్ద "ప్రధాని మోదీ చెప్పిన మంచి రోజు ఇదేనా" అని ఉన్న పోస్టర్లను శివసేన ఏర్పాటు చేసింది. 2015 ఏడాదికి 2021వ సంవత్సరానికి గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఉన్న వ్యత్యాసాన్నిఈ పోస్టర్లలో శివసేన వివరించింది.

ఇదీ చదవండి :'రైతుల మేలు కోసమే సాగు చట్టాలు'

ABOUT THE AUTHOR

...view details